రమ్యకృష్ణ మాట్లాడుతూ.. మాకు పెళ్లయింది. పెళ్లి రిలేషన్ లోనే ఉన్నాం కానీ మేమిద్దరం వేరు వేరు సిటీలలో ఉంటున్నాము. అది మా ఇద్దరి సమ్మతంతోనే. నేను సీరియల్స్ ప్రొడక్షన్ చేసినప్పుడు మా అబ్బాయికి 6 ఏళ్ళు. అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చేదాన్ని 15 రోజులకు ఒకసారి. తెలంగాణ బంద్ అపుడు మా అబ్బాయి స్కూల్ కట్ అవ్వడం, మా అబ్బాయి హెల్త్ డిస్ట్రబ్ అవ్వడంతో చెన్నై కి వెళ్ళిపోయాను. కానీ ఆయన ఇక్కడే ఉన్నారు. అందుకే ఇద్దరం వేర్వేరు చోట ఉంటున్నాము. మాకు ఎవరి మీద ఎవరికీ కంప్లైంట్స్ లేవు. మేము ఇప్పుడు మంచి ఫ్రెండ్స్.
శ్రీ ఆంజనేయం చేసిన తర్వాత నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు అని చెప్పాను. అప్పటి నుంచి నాకు ఒక్క స్టోరీ కూడా చెప్పలేదు, డిస్కస్ చేయలేదు ఆయన. అప్పట్నుంచి ఆయన వర్క్ ఆయనది, నా వర్క్ నాది. నా వర్క్ లో ఆయన వేలు పెట్టరు. నేను ఆయన వర్క్ లో వేలు పెట్టాను. నాకు మ్యారేజ్ కొన్ని సార్లు ఓవర్ రేటెడ్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఒక రిలేషన్ షిప్ పెళ్లి అవసరమైనప్పుడు చేసుకోవాలి. వంశీ మొదట్లో పెళ్లి వద్దు, లివ్ ఇన్ ఉందాం అన్నారు. అప్పుడు ఎస్ చెప్పాల్సింది. కానీ ఇప్పుడు అలా అనిపిస్తుంది. పెళ్లిలో ఫ్యామిలీ, చుట్టాలు, చాలా మంది ఉంటారు. వాళ్లందరికీ సమాధానం చెప్పాలి. మేము దూరంగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాము. కాకపోతే పెళ్లి అనే రిలేషన్ లో ఉన్నాము అని తెలిపింది.
దీంతో రమ్యకృష్ణ – కృష్ణవంశీ అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, అప్పుడప్పుడు కలుస్తున్నట్టు తెలుస్తుంది.


