సూపర్ ఆఫర్ మావా.. ఈ మోటోరోలా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫీచర్లు కోసమైన కొనేస్తారు..!

Must read

  • మోటోరోలా 7000mAh బ్యాటరీ ఫోన్ అతి తక్కువ ధరకే
  • 50MP కెమెరా, అమోల్డ్ డిస్‌ప్లేతో అదిరిపోయే ఆఫర్
  • రూ. 33,249కే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్

అదిరిపోయే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటాయి. 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇక స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. బీజీఎంఐ గేమ్‌ను 120fps వరకు రన్ చేయగలదని కంపెనీ చెబుతోంది..

50MP కెమెరా.. 7000mAh బ్యాటరీ :
ఫోటోలు తీసుకోవడానికి ఇందులో OIS సపోర్టుతో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. అన్ని కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.

ఈ మోటోరోలా ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ హైలెట్ అని చెప్పొచ్చు.. సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బ్యాటరీకి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!