నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. మోదీకి కూడా తెలుసు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Must read

  • నా మొబైల్‌లోనే ఆధారాలున్నాయి..
  • ప్రధానికి రాహుల్ గాంధీ సవాల్
  • నా ఫోన్ చూపిస్తా.. మోదీతో చర్చకు సిద్ధమా?
  • ఫోన్ ట్యాపింగ్ నుంచి పెగాసస్ వరకు..

ప్రధాని మోదీకి మరోసారి సవాల్.. 
ఇదే సమయంలో ప్రధాని మోదీకి మరోసారి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల ప్రక్రియ, విదేశీ జోక్యం, జాతీయ భద్రత వంటి అంశాలపై తనతో నేరుగా బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ముఖాముఖి చర్చ జరిగితే ఎవరు దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు? ఎవరు విదేశీ శక్తుల ప్రభావంలో ఉన్నారనే విషయాలు బయటపడతాయని అన్నారు..

రాహుల్ ఆరోపణలను ఖండించిన కేంద్రం :
నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాహుల్‌కు కొత్తేమీ కాదు. 2023లోనూ పెగాసస్ స్పైవేర్ అంశాన్ని లేవనెత్తారు. తనతో పాటు పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లలో పెగాసస్ ఉందని, తమ సంభాషణలను రికార్డు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని కూడా అప్పట్లో చెప్పారు..

అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం గతంలోనే తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. రాహుల్ ఆరోపణలకు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆధారాలు బయటపడతాయా? లేక ఇది రాజకీయ విమర్శలకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!