గోల్కొండ టు జెనీవా వేలం వరకు.. రూ.130 కోట్లకు అమ్ముడైన 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్..

Must read

  • 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
  • 70 ఏళ్లుగా ఒకే కుటుంబం దగ్గర.. ఇప్పుడు కోట్ల వర్షం
  • మోనాలిసా ఆఫ్ డైమండ్స్.. 24 క్యారెట్ల పింక్ డైమండ్ ప్రత్యేకతలివే

ఆ తర్వాత ఈ వజ్రాన్ని రోమ్‌లోని బల్గారి సంస్థకు తీసుకెళ్లి అందమైన ఆభరణంగా తీర్చిదిద్దారు. దీని ఎమరాల్డ్ కట్, ఫ్యాన్సీ ఇంటెన్స్ పింక్ రంగు, (VVS2) స్పష్టతతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యంత అరుదైన టైప్-IIa వజ్రాల కోవకు చెందుతుంది. ఇందులో నైట్రోజన్ ఖాళీ కేంద్రాల వల్లే గులాబీ రంగు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

క్రిస్టీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ మాక్స్ ఫాసెట్ ఈ వజ్రాన్ని ‘పింక్ డైమండ్ల మోనాలిసా’గా అభివర్ణించారు. దీని ధర 10 నుంచి 15 మిలియన్ స్విస్ ఫ్రాంకుల మధ్య పలుకుతుందని అంచనా వేయగా, చివరకు 12.1 మిలియన్ ఫ్రాంకులు (14.6 మిలియన్ డాలర్లు) దక్కాయి.

బోట్స్వానాలో మరో అద్భుతం :
ఇదిలా ఉంటే.. బోట్స్వానాలోని కరోవే గనిలో 37.4 క్యారెట్ల మరో అరుదైన పింక్ డైమండ్ బయటపడింది. ఇందులో సగం గులాబీ రంగు, మరో సగం రంగులేని భాగంగా ఉండటం విశేషం. ఇది భవిష్యత్తులో అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటిగా నిలవొచ్చని నిపుణులు భావిస్తున్నారు..

మరోవైపు ప్రయోగశాలల్లోనూ వజ్రాలను తయారు చేస్తున్నారు. చిన్న వజ్రపు సీడ్‌పై కార్బన్ అణువులను పొరలుగా పేరుకునేలా చేసి సహజ వజ్రాల స్ఫటిక నిర్మాణాన్ని పోలిన రాళ్లను తయారు చేస్తున్నారు. ఇలా సహజంగా ఏర్పడే వజ్రాల నుంచి ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాల వరకు.. ప్రపంచ రత్నాల మార్కెట్‌లో కొత్త కొత్త విశేషాలు ఆసక్తి రేపుతున్నాయి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!