బ్యాట‌ర్లు విఫ‌లం.. న్యూజిలాండ్‌తో నాలుగో వ‌న్డేలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన భార‌త్.. ఏకంగా 240 ప‌రుగుల తేడాతో..

Must read

IND vs NZ : మౌంట్ మౌంగనుయి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన నాలుగో వ‌న్డేలో భార‌త్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 334 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 26.4 ఓవ‌ర్ల‌లో 89 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో న్యూజిలాండ్ 244 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త ఆధిక్యాన్ని 2-1కి త‌గ్గించింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (27; 53 బంతుల్లో 4 ఫోర్లు), అక్ష‌ర్ ప‌టేల్ (21; 36 బంతుల్లో 3 ఫోర్లు), న‌మ‌న్ ధీర్ (21; 24 బంతుల్లో 2 సిక్స‌ర్లు) మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు డ‌కౌట్లు అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ (5) ఘోరంగా విఫ‌లం అయ్యాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మ్యాట్ హెన్రీ ఆరు వికెట్ల‌తో భార‌త ప‌త‌నాన్ని శాసించాడు. మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు సాధించాడు. కైల్ జేమిస‌న్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవ‌ర్ల‌లో 333 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో విల్ యంగ్ సెంచ‌రీ (125; 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. టిమ్ సీఫెర్ట్ (58; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. ఫిన్ అలెన్ (41; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో అకిల్ న‌బీ, గుర్నూర్ బ్రార్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, న‌మ‌న్ ధీర్‌లు చెరో వికెట్ తీశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!