12,000mAh బ్యాటరీతో OPPO కొత్త ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్నిరోజులు వస్తుందంటే?

Must read

  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో సంచలనం..
  • ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే ఒప్పో A7 అల్ట్రా ఫోన్
  • 12000mAh బ్యాటరీ.. ఒప్పో కొత్త ఫోన్‌పై భారీ అంచనాలు

ఆకట్టుకునేలా డిజైన్ :
లీకైన ఫొటోల ప్రకారం.. ఈ ఫోన్ పర్పుల్ కలర్‌లో కనిపిస్తోంది. బ్యాక్ సైడ్ అడ్డంగా ఉండే భారీ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ కనెక్టివిటీ, Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉండనున్నట్లు సర్టిఫికేషన్ వివరాలు సూచిస్తున్నాయి.

ఇప్పటికే ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో 10,000mAh బ్యాటరీ, ఎ7 ప్రోలో 8,000mAh బ్యాటరీ అందించింది. ఇప్పుడు A7 అల్ట్రా నిజంగానే 12,000mAh బ్యాటరీతో వస్తే ఈ సిరీస్‌లోనే ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది..

భారత్‌లోకి వస్తుందా? ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఈ ఫోన్ ప్రాసెసర్, డిస్‌ప్లే సైజు, ఛార్జింగ్ స్పీడ్, ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది. భారత్‌లో లాంచ్ ధరపై ఇంకా క్లారిటీ లేదు. భారీ బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు, మందం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఒప్పో నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.. డిసెంబర్‌లో ఈ ఫోన్‌పై మరిన్ని వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!