బిగ్ అలర్ట్.. క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే మీ ఫోన్, పీసీ హ్యాకర్ల చేతుల్లోకి!

Must read

  • గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్..
  • క్రోమ్‌లో డేంజరస్ సెక్యూరిటీ లోపాలు
  • క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక..

హ్యాకర్లు ప్రత్యేకంగా జనరేట్ చేసిన డేంజరస్ వెబ్‌సైట్లను యూజర్లు ఓపెన్ చేసేలా చేసి ఈ లోపాలను వాడుకోవచ్చు.. అలా జరిగితే మీ వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, డివైజ్ ల్లో హానికరమైన కోడ్ రన్ చేయడం, సిస్టమ్ పర్ఫార్మెన్స్ దెబ్బతీయడం వంటి రిస్క్ ఉండొచ్చు..

వెంటనే క్రోమ్ అప్‌డేట్ చేసుకోండి :
157.0.8103.50 కన్నా పాత క్రోమ్ వెర్షన్లు, అలాగే 156.0.8078.96 కన్నా పాత (Extended Stable) వెర్షన్లు రిస్క్‌లో ఉన్నాయని హెచ్చరించారు. అందుకే వెంటనే క్రోమ్ ఓపెన్ చేసి రైట్ సైడ్ పైన ఉన్న త్రి డాట్స్ పై క్లిక్ చేయండి. (Help)లోకి వెళ్లి (About Google Chrome)పై క్లిక్ చేయండి. కొత్త అప్‌డేట్ ఉంటే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.

ఇన్‌స్టాల్ అయిన తర్వాత బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయండి. చిన్న అప్‌డేట్‌ను నిర్లక్ష్యం చేసినా పెద్ద సైబర్ రిస్క్ ఎదుర్కోవాల్సి రావొచ్చు.. అన్ నౌన్ లింకులు, అనుమానాస్పద వెబ్‌సైట్లకు దూరంగా ఉండండి. మీ డిజిటల్ భద్రత మీ చేతుల్లోనే ఉందని మర్చిపోవద్దు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!