హార్దిక్ -అర్ష్‌దీప్ ట్రేడ్ డీల్ పూర్తి.. పెరిగిన పాండ్యా జీతం..

Must read

Hardik Pandya-Arshdeep Singh : ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. స్టార్ ఆట‌గాడు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును వీడాడు. అత‌డు ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ త‌రుపున ఆడ‌నున్నాడు. మ‌రోవైపు అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు. ఈ మేర‌కు ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య ట్రేడ్ డీల్ జ‌రిగింది.

ఇక్క‌డ హార్దిక్ పాండ్యా జీతం 16.35 కోట్ల నుంచి 18 కోట్ల‌కు పెరిగింది. ఐపీఎల్ 2027లో అత‌డు పంజాబ్ కింగ్స్ నుంచి 18 కోట్ల మొత్తాన్ని జీతంగా అందుకోనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ మాత్రం 18 కోట్ల‌తోనే ముంబైతో చేరాడు. కాగా.. ఈ ట్రేడ్‌పై గత కొన్ని వారాలుగా ఊహాగానాలు కొన‌సాగుతుండ‌గా బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది.

దీనికి ఒక రోజు ముందే అర్ష్‌దీప్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ ఈ ట్రేడ్ గురించి మాట్లాడారు. తమకు ఇప్పటికే ట్రేడ్‌కు సంబంధించిన అధికారిక సమాచారం అందినట్లు ఓ వీడియోలో వెల్లడించారు. న్యూజిలాండ్‌లో జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో మాట్లాడుతూ దర్శన్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు.

ఊహించని విధంగా ఈ ట్రేడ్ జరిగిన విషయం మాకు తెలిసింది. అతను ట్రేడ్ అయినట్లు అధికారిక సమాచారం కూడా వచ్చి ఉండొచ్చు. ఒక వ్యక్తి ఎక్కడ పుట్టినా, తన సొంత ప్రాంతంపై ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. జీవితాంతం ఆ అనుబంధాన్ని మర్చిపోలేడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతనికి సొంత ఇల్లులాంటిది. ఆ జట్టుతో అతనికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే కొంత భావోద్వేగానికి గురయ్యాం. అని ఆయన తెలిపారు.

అయితే, తన కుమారుడు ముంబై ఇండియన్స్‌లో చేరడంపై కూడా సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.

“ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ ట్రేడ్ జరిగింది. ముంబై ఇండియన్స్ విషయంలోనూ మేము చాలా సంతోషంగా ఉన్నాం. అక్కడ అతని పాత కెప్టెన్, పాత సహచరులు బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. అందుకే మేము చాలా సంతోషంగా ఉన్నాము అని దర్శన్ సింగ్ పేర్కొన్నారు.

ముంబై ఇండియన్స్ త‌రుపున హార్దిక్ పాండ్యా గ‌త మూడు సీజ‌న్ల‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. 39 మ్యాచ్‌లు ఆడ‌గా 35 ఇన్నింగ్స్‌ల్లో 21.53 స‌గ‌టు, 147.82 స్ట్రైక్‌రేటుతో 647 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 48*. ఇక బౌలింగ్‌లో 29 వికెట్లు తీశాడు. హార్దిక్ నాయ‌క‌త్వంలో ముంబై జ‌ట్టు ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే.. 2024, 2026 సీజన్లలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.

మ‌రోవైపు.. అర్ష్‌దీప్ సింగ్ ఎనిమిది సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతను పంజాబ్ త‌రుపున 96 మ్యాచ్‌లు ఆడాడు. 111 వికెట్లు తీశాడు. పంజాబ్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!