చంద్రబాబు కేబినెట్ భేటీ.. ఏపీ భవిష్యత్తును మార్చే 30కి పైగా అజెండా అంశాలివే!

Must read

  • రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్?
  • డేటా సెంటర్ల నుంచి సెమీకండక్టర్ల వరకు కీలక పాలసీలు
  • ఏపీకి పెట్టుబడుల జోరు.. నేడు కేబినెట్‌లో కీలక చర్చలు
  • కేబినెట్ ముందుకు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదనలపై చర్చ :
భీమిలిలో రూ.31,387 కోట్లతో గ్రీన్ ఏఐ డేటా సెంటర్, భోగాపురంలో రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదనలు కూడా చర్చకు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు అందనున్నాయి..

సోలార్ పవర్, బయోగ్యాస్ ప్లాంట్లు.. :
పరిశ్రమలతో పాటు మౌలిక వసతులపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విజయవాడలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్, సోలార్ పవర్ ప్రాజెక్టులు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటిరోకు భూకేటాయింపు, అన్నమయ్య జిల్లాలో ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్క్, జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు కూడా అజెండాలో ఉన్నాయి..

మరోవైపు పోలీస్ శాఖలో రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటు, తిరుమలలో కొత్త పోస్టులు, అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్ఎంఆర్ టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపైనా చర్చకు రానుంది. సమావేశం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, విశాఖలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!