ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో కాంబో పాస్ ధరలు భారీగా తగ్గింపు.. డే పాస్ కూడా రూ.325!

Must read

Metro-RTC Combo Pass: హైదరాబాద్ మహా నగరంలో ప్రతినిత్యం ప్రయాణించే మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. రెండు ప్రజారవాణా వ్యవస్థల్లోనూ నిరభ్యంతరంగా ప్రయాణించేందుకు వీలుగా గతంలో ప్రవేశపెట్టిన ఉమ్మడి ప్రయాణ పాస్ (Metro-RTC Combo Pass)ధరలను భారీగా తగ్గించాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులపై పడుతున్న ఆర్థిక భారాని తగ్గించడమే లక్ష్యంగా ఆర్టీసీ ఎండీ, మెట్రో రైలు సలహాదారుల మధ్య ఇప్పటికే కీలక చర్చలు పూర్తయ్యాయి. దీపావళి కానుకగా ఈ తగ్గిన నూతన ధరలను అమల్లోకి తీసుకురావడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

సగానికి తగ్గనున్న నెలవారీ పాస్.. అమాంతం తగ్గిన చార్జీల వివరాలు:

గతంలో నెలవారీ ఉమ్మడి పాస్ ధర రూ.8,500గా నిర్ణయించడంతో ప్రయాణికుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం, ఆ పాస్ ధరను ఏకంగా రూ.4,000 లేదా రూ.4,500కు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఈ నూతన ధరలో ఆర్టీసీకి రూ.1,000 దక్కనుండగా, మిగిలిన రూ.3,000 నుంచి రూ.3,500 వరకు మెట్రో యాజమాన్యానికి కేటాయించేలా ఒప్పందం కుదిరింది. అలాగే ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ కాంబో పాస్ ధరను రూ.325కు తగ్గించనుండగా, అందులో ఆర్టీసీకి రూ.75, మెట్రోకు రూ.250 వాటాగా విభజించనున్నారు.

సీఎస్ సమావేశంతో అధికారిక ప్రకటన.. దీపావళి నుంచే అమల్లోకి:

ఈ ధరల తగ్గింపు ప్రతిపాదనలపై స్పష్టత సాధించేందుకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మెట్రో సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుతో సమావేశం కానున్నారు. ఈ కీలక భేటీ ముగిసిన వెంటనే తగ్గిన నూతన ధరలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గనుండటంతో నగరవాసులకు ఇది గొప్ప ఊరటనివ్వనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!