Jailer 2 OTT : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జైలర్ చిత్రాన్నికి సీక్వెల్ ఈ మూవీ రూపుదిద్దుకుంది. 2026 అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం బాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా సన్ పిక్చర్స్ సంస్థ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించింది. హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి, విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తిలు కీలక పాత్రల్లో నటించారు.
TIGER MUTHUVEL PANDIAN is back. RELOADED
#Jailer2OnPrime, Nov 12
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @vidya_balan @sunpictures @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu https://t.co/AgpP66EEwT
— prime video IN (@PrimeVideoIN)



