ఫ్రీ అంబులెన్స్ సేవలకు బ్రేక్.. ఇప్పుడు రూ.2,500 ఛార్జీ! బ్లింకిట్ కొత్త రూల్ వెనుక అసలు రీజన్ ఇదే!

Must read

  • బ్లింకిట్ అంబులెన్స్‌కు కూడా బుకింగ్ ఛార్జీనా?
  • ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌లకు రూ.2,500 ఫీజు..
  • బ్లింకిట్ కొత్త నిర్ణయంతో అసలు సమస్య ఏంటంటే

Blinkit Ambulance Service : మెడికల్ ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ దొరకడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో నిమిషం ప్రాణాలతో పోరాటం చేసే పరిస్థితులు అవి.. అలాంటి సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం.

ఇలాంటి సమస్యకు పరిష్కారంగా బ్లింకిట్ 10 నిమిషాల అంబులెన్స్ సేవలను తీసుకొచ్చింది. అయితే, మొదట్లో ఈ సర్వీసును చూసి అందరు అద్భుతమన్నారు.. కానీ ఇప్పుడు ఆ అత్యవసర అంబులెన్స్ సేవల్లో కొత్త మార్పు చర్చకు దారితీసింది. ఇంతకీ ఏంటా మార్పు? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బ్లింకిట్ పేరెంట్ కంపెనీ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ తాజా ప్రకటన ప్రకారం.. ఇకపై నాన్-ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలకు రూ.2,500 వసూలు చేయనున్నారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అవసరమైన వారికి మాత్రం ఈ సేవలు ఎప్పటిలాగే ఉచితంగానే అందుతాయని ఆయన స్పష్టం చేశారు.

అసలు ఛార్జీలు ఎందుకంటే? :
గోయల్ చెప్పిన రీజన్ చాలా ఆసక్తికరంగా ఉంది. గత రెండేళ్లలో బ్లింకిట్ అంబులెన్స్‌లు సుమారు 42 వేల కేసులను నిర్వహించాయట.. ఇందులో దాదాపు 20 వేల కేసులు మాత్రమే ఎమర్జెన్సీ కేసులంట.. మిగిలిన వాటిలో సాధారణ హాస్పిటల్ చెకప్‌లు, రొటీన్ ప్రయాణాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.

Read Also : 

అంటే.. అంబులెన్స్‌లను ఎమర్జెన్సీ సర్వీసుల కోసం కాకుండా సాధారణ క్యాబ్‌ల మాదిరిగా వాడుకుంటున్నారు.. దీంతో నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అంబులెన్స్‌లు అందుబాటులో ఉండటం కష్టమవుతోందని సంస్థ భావిస్తోంది..

అందుకే సాధారణ ప్రయాణాలకు రూ.2,500 ఫీజు విధించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఎటర్నల్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు మళ్లించి, అంబులెన్స్ సేవల విస్తరణతో పాటు పారామెడికల్ సిబ్బంది ట్రైనింగ్ కోసం వాడుతామని తెలిపింది.

రాబోయే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలో దేశంలోని ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించాలన్నది బ్లింకిట్ టార్గెట్.. మొత్తానికి బ్లింకిట్ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఒక్కటే.. అంబులెన్స్‌లు అవసరమైన సమయంలోనే అందుబాటులో ఉండాలి. ప్రాణాలు కాపాడే సేవలు సాధారణ ప్రయాణాల కోసం బిజీగా ఉండకూడదు అనమాట..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!