ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే!

Must read

AP DSC Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలో ఖాళీగా ఉన్న 2,721 టీచర్ పోస్టుల భర్తీకి విజయవాడలో అధికారికంగా డీఎస్సీ (AP DSC Notification) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్ 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా జనరల్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీలకు 2,111 పోస్టులు, ప్రత్యేక విద్యలో 350 పోస్టులు, వివిధ సొసైటీల పరిధిలో 260 పోస్టులను కేటాయించారు. పోస్టుల రిజర్వేషన్ రోస్టర్, హారిజాంటల్ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్షలు.. నవంబర్ నుంచి జనవరి వరకు పూర్తి షెడ్యూల్:

డీఎస్సీ పరీక్షలను సంపూర్ణంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించనున్నారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు ఈ రాతపరీక్షలు కొనసాగుతాయి. అభ్యర్థుల సన్నాహకాల కోసం డిసెంబర్ 5 నుంచి ఆన్‌లైన్ మాక్‌టెస్టులను అందుబాటులోకి తేనుండగా, డిసెంబర్ 14వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. క్రీడాకోటా (Sports Quota) అభ్యర్థులకు కూడా ప్రత్యేకంగా రాతపరీక్షను నిర్వహించనున్నారు.

కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ.. తుది ఫలితాలకు పక్కా ప్రణాళిక:

పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే వేగంగా ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజులకే ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు వారం రోజుల గడువు ఇవ్వనుండగా, ఆ తర్వాతి వారంలో పరిశీలించి తుది ‘కీ’ ని ప్రకటిస్తారు. ఉపాధ్యాయ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ పెద్ద ఊరటగా మారింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!