Rohit Sharma : వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా ఆడిన టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కివీస్ గడ్డపై ఆ ఫామ్‌ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో అతడు విఫలం అయ్యాడు.
186 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగగా.. ఓపెనర్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందిస్తాడని అంతా ఆశించారు.
అయితే.. తొలి ఓవర్లోనే హిట్‌మ్యాన్ ఔట్ అయ్యాడు. కైల్ జేమీసన్ వేసిన ఈ ఓవర్లోని చివరి బంతికి మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో రోహిత్ శర్మపై విమర్శల జడివాన మొదలైంది. ఇలా బ్యాటింగ్ చేస్తే వన్డే ప్రపంచకప్ 2027 చోటు కష్టమేనని అంటున్నారు.
కివీస్‌తో మిగిలిన నాలుగు వన్డేల్లోనూ హిట్‌మ్యాన్ రాణించాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.


