మైదానంలో పాద‌ర‌సంలా రోహిత్ శ‌ర్మ‌.. ఒంటి చేత్తో.. డైవ్ చేస్తూ సూప‌ర్ త్రో.. వీడియో వైర‌ల్‌.. సూప‌ర్ మ్యాన్ అంటున్న నెటిజ‌న్లు..

Must read

Rohit Sharma : చాలా మంది టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ ను మైదానంలో నెమ్మ‌దిగా ఉంటాడ‌ని విమ‌ర్శిస్తుంటారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో త‌న ఫిట్‌నెస్‌ను మెరుగుప‌ర‌చుకున్న హిట్‌మ్యాన్ మైదానంలో పాద‌ర‌సంలా క‌దులుతున్నాడు. ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ర‌నౌట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

టాస్ ఓడి పోయిన కివీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ 22వ ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని తొలి బంతిని గ్లెన్ ఫిలిప్స్ ఎదుర్కొన్నాడు. షార్ట్ లైగ్‌సైడ్ దిశ‌గా షాట్ ఆడాడు. సింగిల్ కోసం ప్ర‌య‌త్నించాడు. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శ‌ర్మ వేగంగా పరిగెత్తుకుంటూ వ‌చ్చి.. బంతి అందుకుని డైవ్ చేస్తూ వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ వైపు త్రో చేశాడు. రాహుల్ కూడా వేగంగా వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. దీంతో డారిల్ మిచెల్ ర‌నౌట్ అయ్యాడు. మిచెల్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 ప‌రుగులు చేశాడు.

దీంతో రోహిత్ శ‌ర్మ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మైదానంలో కుర్రాళ్ల కంటే వేగంగా స్పందిస్తున్న అత‌డు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌2027లో కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని అంటున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!