వావ్.. దీపావళి ఆఫర్ అదుర్స్.. రూ. 26 వేల వన్‌ప్లస్ లైట్ ఫోన్‌ అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Must read

  • 7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే..
  • వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్‌పై భారీ ఆఫర్
  • తక్కువ ధరకే వన్‌ప్లస్ 5G ఫోన్ కొనేసుకోండి

OnePlus Nord CE6 Lite : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అమెజాన్ దీపావళి సేల్‌ ఆఫర్లు అదుర్స్.. మంచి బ్యాటరీ, భారీ డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీతో తక్కువ ధరకే సరికొత్త ఫోన్లు లభ్యమవుతున్నాయి.. అయితే, ఈ సేల్‌ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ సరసమైన ధరకే లభిస్తోంది.. ఈ సేల్‌లో పండుగ ఆఫర్లతో వన్‌ప్లస్ ఫోన్‌పై కూపన్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి..

వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499గా ఉంది. అయితే, దీపావళి సేల్‌లో కూపన్ ఆఫర్ ద్వారా రూ.550 వరకు తగ్గింపు పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, గరిష్ఠంగా రూ.1,250 వరకు ఆదా చేయొచ్చు.. ఈ ఆఫర్లతో ఫోన్ ధర మరింత తగ్గుతుంది. అయితే, బ్యాంక్ ఆఫర్లకు వర్తించే నిబంధనలు, అర్హతలను కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకోవాలి..

Read Also : 

ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవే :
ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందించారు..144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. 680 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కూడా అందిస్తుంది..

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. :
మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది.. ఫొటోల కోసం 50MP మెయిన్ కెమెరా, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 5జీ, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తానికి భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కోరుకునేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. కొనుగోలు చేసే ముందు అమెజాన్‌లో ప్రస్తుత ధర, స్టాక్, ఆఫర్లను ఓసారి చెక్ చేయండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!