కొత్త ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. రూ.50 వేల బడ్జెట్‌లో వన్‌ప్లస్ నుంచి శాంసంగ్ వరకు భారీ ఆఫర్లు!

Must read

  • దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?
  • రూ.50 వేల లోపు అదిరిపోయే 5 బెస్ట్ డీల్స్
  • రూ.37 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్..

Diwali Sale Offers : దీపావళి పండగ వచ్చేస్తోంది.. ఇళ్లల్లో సందడి మొదలైంది. మరోవైపు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ పండగ సేల్ జోరుగా సాగుతోంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నవారికి ఇదే సరైన అవకాశం.

ముఖ్యంగా రూ.50 వేల లోపు బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ, ఫాస్ట్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ల కోసం చూస్తున్నవారికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆసక్తికరమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోన్ల వివరాలు ఓసారి చూద్దాం..

1. వన్‌ప్లస్ నార్డ్ 6 :
ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.44,999కు లభిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్, ఏకంగా 9,000mAh బ్యాటరీతో వస్తుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.37,600 వరకు ధర తగ్గింపు పొందవచ్చు.

Read Also : 

2. శాంసంగ్ గెలాక్సీ A56 5జీ :
12జీబీ ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.45,931గా ఉంది. ఎక్సినోస్ 1580 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీతో వస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

3. రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ 5జీ :
8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,998కు లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్, 10,000mAh బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

4. నథింగ్ ఫోన్ (4a) ప్రో :
ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్,128GB స్టోరేజ్ వేరియంట్ రూ.49,999కు లభిస్తోంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 5,400mAh బ్యాటరీ ఉన్నాయి.

5. రియల్‌మి 16 ప్రో 5జీ :
8GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.46,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ, యాక్సస్ క్రెడిట్ కార్డులతో రూ.6,814 వరకు తగ్గింపు పొందవచ్చు. డైమన్షిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ ఉన్నాయి.

ఏ ఫోన్ కొనాలి? :
మీ అవసరాన్ని బట్టి ఏ ఫోన్ కావాలో ఎంచుకోవడం బెటర్.. బ్యాటరీ, పర్ఫార్మెన్స్, స్టోరేజ్, కెమెరా ఫీచర్లతో కంపేర్ చేసి కొనండి.. ఎక్స్ఛేంజ్ వాల్యూ, బ్యాంక్ ఆఫర్లు కూడా ముందుగా చెక్ చేయండి. ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌ను బట్టి మారుతుంది. కొనుగోలు చేసే ముందు అసలు ధర, ఆఫర్లు, ఏమైనా కండిషన్లు ఉన్నాయో లేదో చెక్ చేయడం మర్చిపోవద్దు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!