వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. భారీ బ్యాటరీతో వివో V80 FE వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Must read

  • వివో నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్.. V80 FE ఫీచర్లు, ధర, లాంచ్ వివరాలివే
  • 50MP కెమెరాలు, 50MP ZEISS కెమెరా, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదుర్స్
  • వివో V80 ఎఫ్ఈ ఇండియా లాంచ్‌ డేట్ ఎప్పుడంటే?

Vivo V80 FE Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో నుంచి మరో కొత్త ఫోన్ సందడి చేయబోతోంది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తమ కొత్త V80 సిరీస్‌లో భాగంగా వివో V80 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే ఈ ఫోన్ భారత్‌లోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో త్వరలోనే ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వివో ఫిలిప్పీన్స్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్ కనిపించగా దీని ఫీచర్లపై కొనుగోలుదారుల్లో మరింత ఆసక్తిని పెంచింది..

Read Also : 

వివో వి80 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు :
లీకైన వివరాల ప్రకారం.. వివో వి80 ఎఫ్ఈలో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉండనుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేయనుంది. 4nm టెక్నాలజీతో మీడియాటెక్ డైమన్షిటీ 7400-టర్బో ప్రాసెసర్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. ఇందులో 8GB LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7తో ఈ ఫోన్ రానున్నట్లు అంచనా..

కెమెరాల విషయానికి వస్తే..
ZEISS టెక్నాలజీతో కూడిన 50MP OIS మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా బ్యాక్ సైడ్ ఉండనున్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్‌కు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.

వై-ఫై 5, బ్లూటూత్ 5.4, NFC, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. IP69 రేటింగ్‌తో పాటు స్పార్కింగ్ గోల్డ్, చిల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.

ధర ఎంత? ఎప్పుడు లాంచ్? :
భారత్‌లో ప్రస్తుతం వివో వి70 ఎఫ్ఈ ధర రూ.44,999 నుంచి ప్రారంభమవుతోంది. వివో వి80 ఎఫ్ఈ ధర రూ.50వేలకు పైగా ఉండవచ్చని అంచనా. 2026 చివరి నాటికి భారత మార్కెట్లో లాంచ్ అవకాశం ఉంది. అయితే, వివో ఇప్పటివరకు ఇండియా లాంచ్, ధర, ఫీచర్లను అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!