దీపావళికి రూ.10 వేలలో బెస్ట్ గిఫ్ట్స్.. స్మార్ట్‌వాచ్ నుంచి ఇయర్‌బడ్స్ వరకు!

Must read

  • పండగ వేళ మీ వాళ్లకు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలా?
  • రూ.10 వేలలో 5 సూపర్ గాడ్జెట్స్
  • వన్ ప్లస్ బడ్స్ నుంచి CMF హెడ్ ఫోన్ ప్రో వరకు

Diwali 2026 : దీపావళి పండగ వచ్చేస్తోంది.. నవంబర్ 8, 2026న దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్లో ఫెస్టివ్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఏదైనా మంచి గాడ్జెట్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారా? అయితే, రూ.10 వేల బడ్జెట్‌లో లభించే 5 అదిరిపోయే గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేయండి..

1. వన్‌ప్లస్ బడ్స్ 4 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ :
మ్యూజిక్ లవర్స్‌కు ఇదో మంచి గిఫ్ట్. అమెజాన్‌లో రూ.6,099 ధరకు లభిస్తోంది. HDFC క్రెడిట్ కార్డుతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.1,250) పొందవచ్చు. 55dB ANC, IP55 రేటింగ్, గేమింగ్ మోడ్, 45 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల ప్లేబ్యాక్ వస్తుంది.

2. బోట్ అల్టిమా వోగ్ 2 స్మార్ట్ వాచ్ :
రూ.2,799కే ఈ స్మార్ట్‌వాచ్ సొంతం చేసుకోవచ్చు. 1.96 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్, మెటాలిక్ ఫ్రేమ్, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. IP68 రేటింగ్ కూడా ఉంది.

Read Also : 

3. అమెజాన్ ఎకో డాట్ (5వ జనరేషన్ ) :
రూ.5,098 ధరకు లభించే ఈ స్మార్ట్ స్పీకర్‌లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఉంది. స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్, జియోసావన్, ఆపిల్ మ్యూజిక్ సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ లైట్లు, ఏసీ, టీవీ వంటి డివైజ్‌లకు వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చు. మోషన్ డిటెక్షన్, టెంపరేచర్ సెన్సార్ కూడా ఉన్నాయి.

4. బ్లాపుంకెట్ ఆర్ అండ్ ఆర్ రిథమ్ పార్టీ :
పార్టీ ప్రియులకు ఈ గాడ్జెట్ బెస్ట్ గిఫ్ట్. రూ.7,999 ధరతో లభించే ఈ స్పీకర్ 100W RMS సౌండ్, డ్యూయల్ 6.5 ఇంచ్ వూఫర్స్, ట్వీటర్‌తో వస్తుంది. బ్లూటూత్, USB, AUX, FM, కరోకే మైక్, 8 లైటింగ్ మోడ్స్ ఉన్నాయి. 3,600mAh బ్యాటరీతో 10 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది..

5. సీఎంఎఫ్ హెడ్‌ఫోన్ ప్రో :
రూ.5,499 ధరతో లభించే ఈ హెడ్‌ఫోన్స్‌లో 40mm డ్రైవర్స్, ఎల్డీఏసీ, 40dB ఏఎన్‌సీ, ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ఉన్నాయి. ఏఎన్‌సీ ఆన్‌లో ఉన్నా 50 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. ఆండ్రాయిడ్ ఐఓఎస్, విండోస్, మ్యాక్ఓఎస్‌లకు సపోర్ట్ చేస్తాయి. మెమరీ ఫోమ్ ఇయర్ కుషన్స్ అదనపు సౌకర్యాన్ని అందిస్తాయి. మొత్తానికి, మీ బడ్జెట్‌ను బట్టి ఈ 5 గ్యాడ్జెట్స్‌లో నచ్చినదాన్ని ఎంచుకుని దీపావళికి మీ స్నేహితులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వొచ్చు..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!