మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణాలివే..

Must read

Case Registered Against YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, ఏజెంట్లతో కలిసి జగన్ ధర్నా నిర్వహించారు. పులివెందుల మున్సిపాలిటీలో తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ జగన్ నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారని ఆయన పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. జగన్ మోహన్ రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్ రెడ్డి, మరికొందరు వైసీపీ నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!