2 గంటల్లోనే తిరుపతి ప్రయాణం.. సిద్దమవుతున్న 4 లేన్స్ కొత్త హైవే.. ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

Must read

Green field Expressway: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు, తిరుమల శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.2,254 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 122 కిలోమీటర్ల కడప-రేణిగుంట నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (Green field Expressway) పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం చొరవతో అటవీ శాఖ అనుమతులు, భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తి కావడంతో కడప జిల్లా పరిధిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

2 గంటల్లోనే రేణిగుంట.. శ్రీవారి భక్తులకు తప్పనున్న రోడ్డు తిప్పలు:

ప్రస్తుతం కడప నుంచి రేణిగుంట వెళ్లడానికి గుంతల రోడ్లు, ప్రమాదకర మలుపుల వల్ల దాదాపు 4 గంటల సమయం పడుతోంది. అయితే, గంటకు 100 కి.మీ గరిష్ట వేగంతో రూపొందిస్తున్న ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే కేవలం 2 గంటల్లోనే రేణిగుంటకు, అలాగే రెండున్నర గంటల్లో తిరుపతికి చేరుకోవచ్చు. రైల్వే కోడూరు-రేణిగుంట మార్గంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రమాదాలను నివారించేలా ఆధునిక సాంకేతికతతో రహదారిని విస్తరిస్తున్నారు.

2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి.. ఎన్‌హెచ్‌ఏఐ నిర్దేశిత గడువు:

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ప్రాజెక్ట్‌ను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే కోడూరు నుంచి రేణిగుంట మార్గంలో చెట్ల తొలగింపు పనులు వేగవంతం కాగా, చెన్నై-కడప మార్గంలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే శాశ్వత పరిష్కారం చూపనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!