పులివెందులలో వైఎస్ జగన్.. ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఆగ్రహం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

Must read

YS Jagan: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan)తక్షణమే పులివెందులకు చేరుకుని అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, పోలీసుల యంత్రాంగ దుర్వినియోగాన్ని ఆయన తీవ్ర స్థాయిలో నిలదీశారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖునీ చేస్తున్నారని, ఎన్నికల యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని జగన్ ఘాటుగా విమర్శించారు.

ఫ్లైట్ ల్యాండింగ్‌కు ఆటంకాలు.. నన్ను ఆపేందుకు యత్నించారన్న జగన్:

నేరుగా పులివెందులకు వచ్చి స్థానిక పరిస్థితిని సమీక్షించకుండా తనను అడ్డుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డిందని వైఎస్ జగన్ ఆరోపించారు. తాను ప్రయాణిస్తున్న ఫ్లైట్ ల్యాండ్ కాకుండా అధికారులు అనేక ఆటంకాలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. సొంత నియోజకవర్గానికి పార్టీ అధినేత రాకుండా ఆపాలని చూస్తున్నారంటేనే ప్రభుత్వంలో ఏ స్థాయిలో భయం నెలకొందో అర్థమవుతోందని పేర్కొన్నారు. తమ పాలన, సంక్షేమంపై నిజంగానే నమ్మకం ఉంటే, ఎన్నికలను ఇంత దారుణమైన రీతిలో నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

పోలింగ్ ఏజెంట్లు లేకుండానే ఎన్నికలా? ఆర్వో వద్దకు వెళ్తామన్న వైఎస్సార్సీపీ అధినేత:

పోలింగ్ కేంద్రాల్లో కనీసం వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు కూడా లేకుండా బెదిరింపులకు గురిచేస్తూ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని జగన్ నిలదీశారు. దౌర్జన్యాలు, బెదిరింపుల నడుమ జరుగుతున్న ఈ ఎన్నికల తీరుపై నిలదీసేందుకు తాము నేరుగా రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వద్దకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తూ ప్రజల తీర్పును మభ్యపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయడం వల్లే సమాజంలో నక్సలిజం వంటి తీవ్రవాద ధోరణులు, కాక్రోచ్‌ల వంటి శక్తులు పుట్టుకొస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

1,000 మంది పోలీసుల మోహరింపుపై ప్రశ్నించిన జగన్.. ప్రజలు అసహనంతో ఉన్నారు:

కేవలం ఒక మున్సిపాలిటీ ఎన్నికల కోసం 1,000 మందికి పైగా పోలీసు బలగాలను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే ఈ స్థాయిలో బలగాలను రంగంలోకి దించారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై ప్రజలు ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజలు ఈ అరాచక పాలనకు తగిన బుద్ధి చెబుతారని జగన్ స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!