ఆ ముగ్గురికి నిద్ర పట్టడం లేదట.. మోదీ, షా, సీఈసీపై రాహుల్ గాంధీ ఫైర్!

Must read

  • జైలుకు వెళ్లక తప్పదు.. ఓట్ల చోరీతోనే గెలుస్తున్నారు..
  • సీఈసీకి రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్
  • రాజ్యాంగంపై దాడిని సహించం..
  • రామ్‌లీలా మైదానంలో రాహుల్ గర్జన

Rahul Gandhi : దేశ రాజకీయాల్లో మరోసారి ఓట్ల చోరీ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురికీ రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశానికి ఆత్మలాంటి రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు..

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక పార్టీకి, ఒక నాయకుడికి (Rahul Gandhi) సంబంధించిన పోరాటం కాదన్నారు. దేశ యువత, మహిళలు, రైతులు, కార్మికుల గొంతుకగా అభివర్ణించారు. మతం కన్నా ప్రతి భారతీయుడి గొంతుకే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు.

వారిపై చర్యలు తీసుకోవాలి.. రాహుల్ గాంధీ డిమాండ్ : 
దేశంలో ఎన్నో ఏళ్లుగా ఓట్ల చోరీ జరుగుతోందని, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ దీని ద్వారానే గెలిచారని రాహుల్ ఆరోపించారు. దేశ వ్యవస్థ మొత్తం ఇద్దరు, ముగ్గురి చేతుల్లోనే ఉండాలన్న ఆలోచనను సహించబోమన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రాహుల్.. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని, ఆయన జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు.

Read Also : 

మరోవైపు, మోదీ ఎక్కడికీ వెళ్లరంటూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ స్పందించారు. తప్పించుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదన్నారు. గత 12 ఏళ్లలో యువతకు ఉద్యోగాలు, రైతులకు సరైన ఆదాయం దక్కలేదని విమర్శించారు.

కొందరు వ్యాపారవేత్తలకే లాభాలు చేకూరేలా పాలన సాగుతోందని ఆరోపించారు. టెలికాం, పోర్టులు, బ్యాంకులు వంటి కీలక రంగాలను ఒకే వ్యక్తి చేతుల్లో పెడుతున్నారని, మోదీ, అమిత్‌ షా కలిసి దేశాన్ని అమ్మేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!