టీ20 క్రికెట్‌లో ఇషాన్ కిష‌న్ మ‌రో మైలురాయి.. హార్దిక్ పాండ్యా రికార్డు బ్రేక్..

Must read

Ishan Kishan : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. హామిల్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 45 ప‌రుగుల వ‌ద్ద అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు.

అంతేకాదండోయ్ భార‌త్ త‌రుపున అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల ప‌రంగా) 2 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న మూడో బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

టీమ్ఇండియా త‌రుపున అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల ప‌రంగా) 2 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు అభిషేక్ శ‌ర్మ పేరిట ఉంది. 1024 బంతుల్లో అభిషేక్ శ‌ర్మ 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ త‌రువాత రెండో స్థానంలో సూర్య‌కుమార్ యాద‌వ్ ఉన్నాడు. అత‌డు 1164 బంతుల్లో ఈ ఘ‌న‌త సాధించ‌గా ఇషాన్ కిష‌న్ 1345 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయ‌ర్లు వీరే..
* అభిషేక్ శ‌ర్మ – 1024 బంతుల్లో
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 1164 బంతుల్లో
* ఇషాన్ కిష‌న్ – 1345 బంతుల్లో
* హార్దిక్ పాండ్యా – 1390 బంతుల్లో

ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ 32 బంతులు ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు, 5 సిక్స‌ర్ల సాయంతో 61 ప‌రుగులు సాధించాడు.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!