Glenn Phillips : హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఫిలిప్స్ 4 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేశాడు. ఇందులో నాలుగో టీ20 మ్యాచ్‌లో చేసిన శతకం (49 బంతుల్లో 107 పరుగులు) కూడా ఉంది.
కాగా.. ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు గ్లెన్ ఫిలిప్స్‌ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అతడు 56 పరుగులు చేస్తే ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ పేరిట ఉంది. అతడు 2023 డిసెంబర్లో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 331 పరుగులు చేశాడు. ఇక పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆరు టీ20 మ్యాచ్‌ల సిరీస్ళో 316 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు..
ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు గ్లెన్ ఫిలిప్స్‌కు 15 పరుగులు అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు మార్క్ చాప్మన్ పేరిట ఉంది. అతడు 2024లో పాకిస్థాన్ పై ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో 290 పరుగులు చేశాడు.
భారత్‌పై ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికే ఫిలిప్స్ పేరిట ఉంది. ఒకవేళ అతను ఫైనల్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధిస్తే.. ఒక ద్వైపాక్షిక టీ20ఐ సిరీస్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ 50 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. పాకిస్థాన్‌కు చెందిన రిజ్వాన్, జపాన్‌కు చెందిన సబౌరిష్ రవిచంద్రన్ మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించారు.



