Glenn Phillips : న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ అరుదైన ఘనత సాధించాడు. ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. హామిల్టన్ వేదికగా భారత్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 56 పరుగుల వద్ద అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా అతడు 38 బంతులు ఎదుర్కొన్నాడు. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు గతంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ పేరిట ఉండేది. 2023 డిసెంబర్లో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు 331 పరుగులు చేశాడు.
HISTORY WRITTEN BY GLENN PHILLIPS.
– Phillips now holds the record of scoring most runs in a bilateral T20i series. https://t.co/JPnJq6Kv4E
— Mufaddal Vohra (@mufaddal_vohra)
తాజాగా భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గ్లెన్ ఫిలిప్స్ 341 పరుగులతో సాల్ట్ రికార్డును బ్రేక చేశాడు. ఇక ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆరు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 316 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు..
ఓ ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు మార్క్‌చాప్‌మన్ రికార్డు బ్రేక్ చేశాడు. 2024లో పాకిస్థాన్ పై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మార్క్ చాప్మన్ 290 పరుగులు చేశాడు. తాజాగా భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గ్లెన్ ఫిలిఫ్స్ 341 పరుగులు సాధించాడు.

HISTORY WRITTEN BY GLENN PHILLIPS. 

