గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. బంగాళాఖాతంలో బలపడ్డ తుఫాన్.. ఏపీ తీరప్రాంత ప్రజలకు కీలక హెచ్చరికలు!

Must read

AP Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వేగంగా దూసుకువస్తోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ తీవ్ర వాయుగుండం రాగల 6 గంటల్లో మరిన్ని మార్పులకు లోనై, రాగల 12 గంటల్లో తుఫానుగా, తదుపరి 24 గంటల్లో తీవ్ర తుఫానుగా(AP Cyclone Alert) రూపంతరం చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఇది విశాఖకు 980 కి.మీ, మచిలీపట్నానికి 1030 కి.మీ, ఒంగోలుకు 1080 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు స్పష్టం చేశారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడనున్న తుఫాన్.. దక్షిణ కోస్తా వైపు వేగంగా పయనం:

ఈ తీవ్ర తుఫాను నవంబర్ 2వ తేదీనాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకుని తీవ్ర రూపం దాల్చనుంది. అనంతరం నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి అత్యంత సమీపంలోకి చేరుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమై ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని సముద్ర తీర ప్రాంత ప్రజలకు సూచించారు.

నవంబర్ 3న నెల్లూరు – నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం.. గంటకు 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు:

ఈ తీవ్ర తుఫాను నవంబర్ 3వ తేదీ ఉదయం నెల్లూరు, నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భయానక ఈదురుగాలులు వీస్తాయని, గరిష్ఠంగా గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని, తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!