ఫోన్‌పే యూజర్లకు బిగ్ అలర్ట్.. UPI పేమెంట్స్ చేసేటప్పుడు ఈ 3 తప్పులు చేయొద్దు..

Must read

  • యూపీఐ వాడుతున్నారా? ఇలా చేశారంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ
  • డబ్బులు పోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..

PhonePe UPI Fraud : యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే, ఒక్క చిన్న పొరపాటు మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులన్నీ మాయం అవుతాయి జాగ్రత్త.. డిజిటల్ పేమెంట్స్ ద్వారా క్యాష్ అవసరం లేకుండానే క్షణాల్లో డబ్బులు ఎవరికైనా ఎప్పుడైనా పంపుకోవచ్చు.. దీన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఫేక్ పేమెంట్ రిక్వెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, రిమోట్ యాక్సెస్ యాప్స్‌తో అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే (PhonePe) తమ యూజర్లకు యూపీఐ పేమెంట్ల విషయంలో మూడు కీలక సూచనలు చేసింది.. అవేంటో ఓసారి చూద్దాం..

1. డబ్బులు పొందాలంటే UPI PIN అక్కర్లేదు :
మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే ఎలాంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు పంపేటప్పుడు మాత్రమే పిన్ అవసరమవుతుంది. రిఫండ్ ఇస్తామని, డబ్బులు పంపిస్తామని చెప్పి ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమన్నా, పిన్ అడిగినా అప్రమత్తంగా ఉండాలి. పిన్ ఎంటర్ చేస్తే మీ ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయ్యే ప్రమాదం ఉంది.

2. పేమెంట్ చేసే ముందు పేరు చెక్ చేయండి :
డబ్బులు పంపే ముందు స్క్రీన్‌పై కనిపించే బ్యాంక్ ఖాతాదారుడి పేరును తప్పనిసరిగా చెక్ చేయండి.. పేరు సరిపోకపోతే పేమెంట్ చేయకుండా వివరాలను మరోసారి చెక్ చేయండి.. ముఖ్యంగా అపరిచితులు నగదుకు బదులుగా ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తామని చెబితే నమ్మకండి..

Read Also : 

3. OTP, PIN ఎవరితోనూ షేర్ చేయొద్దు :

బ్యాంక్ అధికారులమని, కస్టమర్ కేర్ సిబ్బందిమని ఫోన్ చేసే వ్యక్తులకు OTP, UPI PIN, బ్యాంకింగ్ వివరాలు చెప్పకూడదు. తెలియని లింక్స్ క్లిక్ చేయడం, వారు చెప్పిన స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం ప్రమాదకరం. దాంతో మీ ఫోన్‌లోని సమాచారాన్ని నేరగాళ్లు యాక్సెస్ చేయవచ్చు..

మనీ మ్యూల్ స్కామ్‌ల పట్ల కూడా ఫోన్‌పే హెచ్చరించింది. అక్రమంగా సంపాదించిన డబ్బును మీ ఖాతాలోకి తీసుకుని వేరే ఖాతాలకు పంపమని కొందరు మభ్యపెడతారు. తెలియక చేసినా ఇలాంటి లావాదేవీల వల్ల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయి.. చట్టపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి..

మోసానికి గురైతే ఏం చేయాలి? :
మీ డబ్బులు పోయినట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి. ఫోన్‌పే యాప్‌లోని (Help) సెక్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 080-68727374 లేదా 022-68727374 నంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి. లేదంటే (National Cyber Crime Reporting Portal)లో ఫిర్యాదు చేయవచ్చు.

అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ లేదా టెలిగ్రామ్ మోసాలను (Sanchar Saathi) పోర్టల్‌లోని (Chakshu) ద్వారా కూడా రిపోర్ట్ చేయవచ్చు. యూపీఐ పేమెంట్స్‌లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.. ఒక్కసారి వివరాలు చెక్ చేసుకుని పేమెంట్ చేయడం ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!