కొత్త హానర్ ఫోన్ అదుర్స్.. భారీ బ్యాటరీ.. అదిరిపోయే డిస్‌ప్లే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల బ్యాకప్!

Must read

  • ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా
  • ప్రాసెసింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్, 120Hz రిఫ్రెష్ రేట్
  • రూ.38 వేలకే 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 50MP కెమెరా సెటప్

Honor X9e s Launch : హానర్ లవర్స్ మీకోసమే.. హానర్ నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. ఈసారి X సిరీస్‌లో హానర్ X9e s స్మార్ట్‌ఫోన్‌ను సౌదీ అరేబియాలో లాంచ్ చేసింది. సరసమైన ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 8,560mAh భారీ బ్యాటరీ, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ధర ఎంతంటే? :
హానర్ X9e s ధరను సౌదీ అరేబియాలో 1,499 సౌదీ రియాల్స్‌గా నిర్ణయించారు. భారత కరెన్సీలో సుమారు రూ.38వేలుగా ఉంటుంది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. డాన్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.79 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే, కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు 3840Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Read Also : 

పెర్ఫార్మెన్స్ పరంగా పరిశీలిస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, అడ్రినో 810 జీపీయూ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.

కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా కూడా అందించారు. ఈ ఫోన్‌లో అన్నింటికంటే స్పెషల్ 8,560mAh భారీ బ్యాటరీ.. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. ఇక ఫోన్ మందం 7.76mm కాగా, బరువు 196 గ్రాములు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ సన్నని డిజైన్‌తో హానర్ ఈ ఫోన్‌ను అందిస్తోంది..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!