బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. నవంబర్ లో భారీగా సెలవులు.. ఈ వివరాలు తెలుసుకోండి మరి!

Must read

Bank Holidays: నవంబర్ నెలలో ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర ముఖ్యమైన పనుల కోసం బ్యాంకులకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఖాతాదారులు తప్పనిసరిగా బ్యాంకు సెలవుల జాబితాను పరిశీలించుకోవడం చాలా అవసరం. నవంబర్ 2026 నెలలో దీపావళి, గోవర్ధన పూజ, ఛఠ్ పూజ, గురునానక్ జయంతి వంటి వరుస పండుగలతో పాటు వారాంతపు సెలవులు కూడా భారీగానే రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో పండుగలు, రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కలిపి పలు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల బ్యాంకింగ్ పనుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ముందుగానే ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.

పండుగలు, వారాంతపు సెలవుల వివరాలు.. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే రోజులు!

ఈ నెలలో సాధారణ వారాంతపు సెలవులైన నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీలలో ఆదివారాల సందర్భంగా అలాగే నవంబర్ 14 (రెండో శనివారం), నవంబర్ 28 (నాలుగో శనివారం) తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు(Bank Holidays) పనిచేయవు. వీటితో పాటు దీపావళి, లక్ష్మీ పూజ పురస్కరించుకుని నవంబర్ 9, 10, 11 తేదీల్లో వివిధ రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి. మేఘాలయలో నవంబర్ 13న వంగాల పండుగ, నవంబర్ 23న సెంగ్ కుట్ స్నెమ్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. బీహార్, జార్ఖండ్‌లలో నవంబర్ 16న ఛత్ పూజ, ఉత్తరాఖండ్‌లో నవంబర్ 20న ఇగాస్ బగ్వాల్ పండుగకు బ్యాంకులు మూసివుంటాయి.

తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యాంశాలు.. ఆన్‌లైన్ సేవలు నిరంతరం అందుబాటులో:

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, నవంబర్ 24న గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులకు అధికారిక సెలవు ఉంటుంది. అలాగే నవంబర్ 27న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు. అయితే ఈ సెలవుల రోజుల్లో నేరుగా బ్యాంక్ శాఖలు మూసి ఉన్నప్పటికీ.. ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) వంటి డిజిటల్ సేవలన్నీ వినియోగదారులకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!