- అమెజాన్ దీపావళి సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ తగ్గింపు
- రూ.82,150కే గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్
Samsung Galaxy S25 Ultra : పండుగ వేళ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అమెజాన్ అదిరిపోయే డీల్.. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి ఎడిషన్‌లో భాగంగా ఈ ఫ్లాగ్షిప్ మొబైల్‌ను భారీ ధర తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు..
రూ.47,849 వరకు ఆదా :
ఈ శాంసంగ్ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.1,29,999కు లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.94,999కు లభిస్తోంది. అదనంగా రూ.10వేల కూపన్ డిస్కౌంట్ వర్తిస్తుంది. దీంతో కొనుగోలు ధర రూ.84,999కు చేరుతుంది.
Read Also :
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే మరో రూ.2,849 వరకు తగ్గింపు పొందవచ్చు. అన్ని అర్హతలు, ఆఫర్ నిబంధనలు వర్తిస్తే.. శాంసంగ్ ఫోన్ ధర రూ.82,150 అవుతుంది. ప్రారంభ ధరతో పోలిస్తే రూ.47,849 వరకు ఆదా చేయొచ్చు..
ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 6.9 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ కోసం 200MP మెయిన్ కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో, 10MP టెలిఫోటో సెన్సార్లు ఇచ్చారు.
సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. Wi-Fi 7, 5G కనెక్టివిటీ వంటి బెనిఫిట్స్ అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు..
కొనేముందు ఇది గుర్తుంచుకోండి :
ఈ డీల్‌లో చూపిస్తున్న ఫైనల్ ధర బ్యాంక్ ఆఫర్ అర్హత, కూపన్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ఉంటే మరింత ఆదా కావచ్చు. అయితే, స్టాక్, ఆఫర్లలో మార్పులు ఉండొచ్చు. ఆర్డర్ చేసే ముందు అమెజాన్‌లో ఫైనల్ ధరను ఓసారి చెక్ చేయడం బెటర్..



