- నవంబర్ 1న జరగనున్న పురపాలక ఎన్నికలు
- ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ భారీ భద్రత.. బరిలోకి 36,351 మంది పోలీసులు
- 8 మున్సిపాలిటీల్లో ఏకగ్రీవం.. మిగిలిన చోట్ల ఓటింగ్‌కు ఏర్పాట్లు
AP Local Body Polls : ఆంధ్రప్రదేశ్ పట్టణ రాజకీయాల్లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ప్రచార హోరు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటరు తీర్పుపైనే నిలిచింది. నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సన్నద్ధమయ్యారు.
రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో 8 మున్సిపాలిటీల్లో అన్ని స్థానాలు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికల అవసరం (AP Local Body Elections) లేకుండా పోయింది. మిగిలిన 92 ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలకు తెరపడింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసులను విధుల్లో నియమిస్తున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
Read Also :
తుపాను, భారీ వర్షాల ప్రభావం ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పరిస్థితులను బట్టి అవసరమైన చోట నవంబర్ 2న కూడా పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఇక ఏకగ్రీవమైన మున్సిపాలిటీల్లో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, దర్శి, ప్రొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, ఆళ్లగడ్డ ఉన్నాయి. 13 కార్పొరేషన్ల పరిధిలో 922 డివిజన్లకుగాను 118 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాల్లో టీడీపీ 15 చోట్ల, జనసేన, బీజేపీ ఒక్కోచోట విజయం సాధించాయి. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు పట్టణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.



