WPL 2027 Auction : కొచ్చి వేదికగా బుధవారం మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 మినీ వేలం జరిగింది. అన్ని ఫ్రాంఛైజీలు కలిసి మొత్తం 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ను రూ. 1.1 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌ను సోఫీ నిలిచింది. ఇక భారత ప్లేయర్ల విషయానికి వస్తే.. బ్యాటర్ కిరణ్ నవగిరే అత్యధికంగా రూ. 75 లక్షలకు అమ్ముడుపోయింది. ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వికెట్ కీపర్, బ్యాటర్ జి.కమలినీని రూ.40 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది.
భారత ప్లేయర్లలో పేసర్ తితాస్ సాధు, స్పిన్నర్ సైకా ఇషాక్, వికెట్ కీపర్ బ్యాటర్లు తానియా భాటియా. ఉమా ఛెత్రిలతో పాటు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సోఫియా డంక్లీని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో వారు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైన ప్లేయర్ల జాబితా ఇదే..
UP వారియర్జ్ (UPW):
సోఫీ మోలినెక్స్ – రూ. 1.1 కోట్లు
గ్రేస్ హారిస్ – రూ. 30 లక్షలు
స్నేహ రాణా – రూ. 30 లక్షలు
ఆశా శోభన – రూ. 30 లక్షలు
సుష్మా వర్మ – రూ. 30 లక్షలు
క్యాథరిన్ బ్రైస్ – రూ. 10 లక్షలు
మనాలి దక్షిణి – రూ. 10 లక్షలు
సహనా పవార్ – రూ. 10 లక్షలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
జెస్ జోనాస్సెన్ – రూ. 40 లక్షలు
క్లో ట్రయాన్ – రూ. 30 లక్షలు
తేజల్ హసబ్నిస్ – రూ. 30 లక్షలు
వృందా దినేష్ – రూ. 10 లక్షలు
ఢిల్లీ క్యాపిటల్స్ (DC):
కిరణ్ నవ్‌గిరే – రూ. 75 లక్షలు
కిర్స్టీ గోర్డాన్ – రూ. 10 లక్షలు
నజ్మా ఖాన్ – రూ. 10 లక్షలు
ఉమా కశ్వీ – రూ. 10 లక్షలు
ముంబై ఇండియన్స్ (MI):
శ్వేతా సెహ్రావత్ – రూ. 20 లక్షలు
దిశా కసత్ – రూ. 10 లక్షలు
లతికా ఇనామ్దార్ – రూ. 10 లక్షలు
భారతీ రావల్ – రూ. 10 లక్షలు
సనికా చల్కే – రూ. 10 లక్షలు
అక్షితా భగత్ – రూ. 10 లక్షలు
గుజరాత్ జెయింట్స్ (GG):
జి కమలిని – రూ. 40 లక్షలు
ఓర్ల ప్రెండర్‌గాస్ట్ – రూ. 30 లక్షలు
సమైరా రాఘవ్ – రూ. 10 లక్షలు



