- శాంసంగ్ W27 చైనాలో 18,999 యువాన్ల ప్రారంభ ధరతో లాంచ్
- ఈ ఫోన్‌లో 8 అంగుళాల మడతపెట్టగల స్క్రీన్, 200MP కెమెరా
- 45W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ
Samsung W27 Launch : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో లగ్జరీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. శాంసంగ్ W27 పేరుతో ఈ మడతపెట్టే ఫోన్ ఆకట్టుకునే డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ స్టోరేజ్‌తో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా 200MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 2 హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు.. అయితే, ఈ శాంసంగ్ ఫోన్ ధర సామాన్యులకు కాస్త భారంగానే కనిపిస్తోంది.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
శాంసంగ్ W27 స్పెసిఫికేషన్లు :
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 8 అంగుళాల QXGA+ డైనమిక్ అమోల్డ్ 2X ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఫోన్‌ను ఫోల్డ్ చేస్తే 6.5 అంగుళాల కవర్ స్క్రీన్ అవుతుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 గెలాక్సీ ప్రాసెసర్‌ను అందించారు. 16GB ర్యామ్, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9తో ఈ ఫోన్ వర్క్ అవుతుంది.
200MP కెమెరాతో ఫొటోలు :
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. OISతో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ లోపలి, బయటి స్క్రీన్‌లపై 10MP కెమెరాలను అందించారు.
బ్యాటరీ, డిజైన్ స్పెషల్ :
5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. గోల్డ్ ఫినిషింగ్ మిడ్-ఫ్రేమ్ ఫోన్‌కు రిచ్ లుక్‌ను అందిస్తుంది. జిహు బ్లూ, జిక్సియా హాంగ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
శాంసంగ్ W27 ధర ఎంతంటే? :
చైనాలో 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 18,999 యువాన్లు (సుమారు రూ.2.72 లక్షలు). 1TB స్టోరేజ్ మోడల్ ధర 21,999 యువాన్లు (సుమారు రూ.3.15 లక్షలు) ఉంటుంది. చైనాలో నవంబర్ 13 నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, భారత్‌లో లాంచ్ తేదీ, ధరపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..



