తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 15 వేల ఉద్యోగాలపై కీలక అప్‌డేట్!

Must read

  • ఉద్యోగార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాది పాటు ఫ్రీ కోచింగ్
  • తెలంగాణలో జాబ్ అలర్ట్.. లక్ష మంది రిజిస్ట్రేషన్
  • 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు మంత్రి కీలక ప్రకటన

Govt Jobs Update : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అదిరిపోయే వార్త.. రాష్ట్రంలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

దీంతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచితంగా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది..

ఉచిత ఆన్‌లైన్ కోచింగ్.. లక్ష మంది రిజిస్ట్రేషన్ :
పీఎస్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘పీఎస్‌ఆర్‌ యువనేస్తం’ పేరుతో ఫ్రీ ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్‌సీ ఎగ్జామ్స్‌ సంస్థ సహకారంతో ఈ ట్రైనింగ్ అందించనున్నారు. ఇప్పటికే లక్ష మంది అభ్యర్థులు పేర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఎంతమంది చేరినా ఏడాది పాటు ట్రైనింగ్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Read Also : 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకోవాలంటే.. ప్రైవేట్ సంస్థల్లో భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. శిక్షణకు సుమారు రూ.లక్ష, పుస్తకాలు, స్టడీ మెటీరియల్ కోసం అదనంగా రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత శిక్షణతో పాటు అవసరమైన పుస్తకాలు, అధ్యయన సామగ్రిని కూడా అందించనున్నారు.

గతంలోనూ మంచి ఫలితాలు :
2016లో ఖమ్మంలో 2,300 మంది అభ్యర్థులకు ఆన్‌లైన్ శిక్షణ అందించగా, వారిలో 462 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లు మంత్రి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా యువతకు శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యపైనా మంత్రి కీలక ప్రకటన చేశారు. దీపావళిలోగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించినట్లు వెల్లడించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!