వడ్డీతో సహా చెల్లిస్తాం, సెప్టెంబర్ నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్

Must read

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ క్యాడర్‌లో ధైర్యం నింపేందుకు తాడేపల్లి వేదికగా ఆయన సంచలన ప్రకటనలు చేశారు. రాబోయే సెప్టెంబర్ నెల నుంచి తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు జగన్ ప్రకటన చేసారు. ఈ కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన జోస్యం చెప్పారు.

వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రంలోని ప్రతి పోలీస్ అధికారికి స్పష్టంగా చెబుతున్నా.. నా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా ఉంటాను. ఇప్పుడు మీ టైం నడుస్తోంది.. కానీ మా టైం కూడా తప్పకుండా వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా అసలు చెల్లిస్తాం” అంటూ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ కక్షసాధింపులతో తమ పార్టీ శ్రేణులకు అన్యాయం చేసిన ఏ ఒక్కరినీ భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ.. తనపై రాజకీయంగా దాడి చేయాలనుకుంటే ఎంతమంది వస్తారో రండి, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఎలాంటి కష్ట కాలంలోనైనా తనకు అండగా నిలిచే పులివెందుల ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడే ఉంటానని ఈ సందర్భంగా జగన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేసారు.

The post appeared first on .

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!