వావ్.. వివో నుంచి ఖతర్నాక్ ఫోన్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. ధర తెలిస్తే షాకే..!

Must read

  • వివో X500 6.59-అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లే
  • వివో X500లో 50MP ప్రైమరీ కెమెరా సెటప్
  • వివో ఎక్స్500 7500mAh బ్యాటరీతో వస్తుంది

Vivo X500 Series : వివో లవర్స్ మీకోసమే.. వివో నుంచి సరికొత్త వివో X500ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో నాలుగు 50MP కెమెరాలు ఉన్నాయి. 90W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7500mAh బ్యాటరీతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్‌తో వస్తుంది. వివో X500 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధర ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో X500 ధర లభ్యత :
వివో X500 ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర RM 4,699 (సుమారు రూ. 109,090) కాగా, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర RM 5,299 (సుమారు రూ. 123,020)గా ఉంది. వివో X500 సిరీస్ యూరప్ మలేషియాలో లాంచ్ అయింది. నవంబర్ నెలాఖరు నాటికి భారత మార్కెట్లోకి రానుంది.

వివో X500 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో X500లో 6.59-అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2750×1260 పిక్సెల్స్, యాస్పెక్ట్ రేషియో 19.64:9, 30/60/90/120/144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఏఆర్ఎమ్ జీ1-అల్ట్రా జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600M 3nm చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

12GB LPDDR5X అల్ట్రా ర్యామ్ 256GB/512GB/1TB UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ OS7పై రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ పొడవు 157.01mm, వెడల్పు 74.49mm, మందం, 8.15mm బరువు 211/213 గ్రాములు ఉంటుంది.

Read Also : 

వివో X500లో ఎఫ్/1.68 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ 1/1.28 సోనీ LYTIA-828 కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్/2.55 అపర్చర్, OIS సపోర్ట్, 3.1x ఆప్టికల్ జూమ్‌తో 50MP థర్డ్ 1/1.95″ సోనీ LYT610 జీసెస్ ఏపీఓ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

IP68 + IP69 రేటింగ్ అందించే ఈ ఫోన్ డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, USB టైప్ సి, 3.2 జెన్1, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి. ఇందులో 7500mAh బ్యాటరీ ఉంది. 90W అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ 40W వైర్‌లెస్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!