ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ 5G ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఎంత తగ్గిందంటే?

Must read

  • శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 5జీ భారీ ఆఫర్ అదిరింది
  • 7.6-అంగుళాల అమోల్డ్ 2X ఇంటర్నల్ డిస్‌ప్లే
  • 50MP ప్రైమరీ కెమెరా, 4,800mAh బ్యాటరీతో వస్తుంది

Samsung Galaxy Z Fold8 5G Deal : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 5జీ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ దీపావళి సేల్‌లో కొన్ని అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.. 50MP కెమెరాతో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 16వేల వరకు డిస్కౌంట్‌తో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 5జీపై డీల్స్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,74,999 ధరకు లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జూలైలో రూ. 1,79,999 ధరకు లాంచ్ అయింది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.11వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌, బ్యాంక్ ఆఫర్లతో ధర రూ. 1,63,999కి చేరింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ.16వేల తక్కువకే లభిస్తోంది..

Read Also : 

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 5జీలో 1848×2448 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 7.6-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఇంటర్నల్ డిస్‌ప్లే ఉంది.

అలాగే, 1972×1248 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 10:16 యాస్పెక్ట్ రేషియోతో 5.5-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ9పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరా, 10MP ఇన్నర్ డిస్‌ప్లే కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 4,800mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఛార్జింగ్ 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, Wi-Fi 7, బ్లూటూత్ v6, ఎన్‌ఎఫ్‌సీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!