వావ్.. ఇది కదా ఫోన్.. 7,000mAh బ్యాటరీతో కొత్త మోటోరోలా ఫోన్.. ఫీచర్లు మాత్రం కేక..!

Must read

  • మోటోరోలా ఎడ్జ్ 70 నియో 7,000mAh బ్యాటరీతో వస్తుంది
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ లైటియా మెయిన్ కెమెరా ఉండొచ్చు
  • 2025లో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 60 నియోకు అప్‌గ్రేడ్

Motorola Edge 70 Neo : మోటోరోలా ఫ్యాన్స్ కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటోరోలా అతి త్వరలో భారత మార్కెట్లో రాబోతుంది. అదే.. మోటోరోలా ఎడ్జ్ 70 నియోను లాంచ్ చేయనుంది. కొన్ని లీక్‌లు ఈ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించాయి..

మోటోరోలా ఎడ్జ్ 70 నియోలో 7,000 mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ లైటియా ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా.. గత ఏడాదిలో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 60 నియో స్థానంలో రానుంది.. పూర్తి వివరాలివే..

మోటోరోలా లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్ 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌లతో రావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 4 పాంటోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కావచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 70 నియోలో 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K డిస్‌ప్లే ఉండవచ్చు.

Read Also : 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 70 నియో త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. అయితే, మోటోరోలా లాంచ్ తేదీని ఇంకా రివీల్ చేయలేదు..

కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 70 నియో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP సోనీ లైటియా 710 ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 16తో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 45W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పాటు 7,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా..

గత ఏడాది సెప్టెంబర్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 నియో, 1.5K రిజల్యూషన్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.4-అంగుళాల ఫ్లాట్ pOLED ఎల్టీపీఓ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 5,000mAh బ్యాటరీ, 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!