- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2026 ఆఫర్లు
- ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, గూగుల్ పిక్సెల్ 10 డీల్స్
- బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్లతో మరింత తగ్గింపు
Flipkart Big Bang Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్’ పేరుతో దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ భారీ ఆఫర్ (అక్టోబర్ 28, 2026) ప్రారంభమైంది. మీరు స్మార్ట్ఫోన్లపై మంచి డీల్స్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్‌ను అస్సులు మిస్ అవ్వొద్దు.. ఈ దీపావళి సీజన్లో స్మార్ట్ఫోన్లపై టాప్ డీల్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం..
ఐఫోన్ 17 :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 (256GB) రూ. 99,900 బదులుగా రూ. 88,999కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 4వేల వరకు తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాదు.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 61,050 వరకు వాల్యూతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్లన్నీ కలిపి ఈ ఐఫోన్ రూ. 80వేల లోపు ధరకే ఈజీగా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్ అందిస్తుంది. కంపెనీ సొంత A19 చిప్‌తో రన్ అవుతుంది.
Read Also :
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ :
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ (12GB + 128GB) ధర రూ. 58,999కు పొందవచ్చు. మీరు రూ. 43,400 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 2,950 వరకు కార్డ్ డిస్కౌంట్ పొందవచ్చు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 4,000mAh బ్యాటరీతో వస్తుంది.
గూగుల్ పిక్సెల్ 10 :
గూగుల్ పిక్సెల్ 10 రూ. 74,999కే అందుబాటులో ఉంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 4వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 54,750 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. టెన్సర్ G5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 4,970mAh బ్యాటరీతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ లెన్స్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్, 10.8MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ హ్యాండ్సెట్ 10.5MP లెన్స్ అందిస్తుంది.


