Sigma OTT : తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచయం అయిన చిత్రం సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.
అక్టోబర్ 30న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది. తమిళ్‌తో పాటు తెలుగు భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది.
Anchor Manjusha : చీరకట్టులో క్యూట్‌గా.. యాంకర్ మంజూష ఫోటోలు వైరల్..
లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఫరియా అబ్దుల్లా కథానాయిక. తమన ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. థియేటర్లలో పెద్దగా ఆడని చిత్రాలు ఓటీటీలో అదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరీ సిగ్మా ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


