LPG Strike Alert : గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా సిలిండర్ల సరఫరా ఆగిపోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కేంద్రానికి నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ సమయంలో సమస్యలు పరిష్కారం కాకపోతే దేశవ్యాప్తంగా సమ్మెబాట పడతామని హఎచ్చరించారు.
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే కమిషన్ ను పెంచాలని ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా నిర్వహణ ఖర్చులు పెరిగినా, దేశీయ వంటగ్యాస్ సిలిండర్ల విక్రయంపై వచ్చే కమీషన్లో తగిన మార్పులు లేవని వారు చెబుతున్నారు. కొత్త నిబంధనలు అమలు, అదనపు పనిభారం, నిర్వహణ వ్యయాలు తమపై భారంగా మారాయని పేర్కొంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల ప్రధాన డిమాండ్లు ఇవే..
పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా సిలిండర్లపై కమిషన్ను సవరించాలి.
పైపుల ద్వారా వచ్చే సహజవాయువు (PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్లపై విధిస్తున్న పరిమితులను పునఃపరిశీలించాలి.
గ్యాస్ స్టవ్లు, ఇతర ఉత్పత్తులను విక్రయించాలంటూ లక్ష్యాలు విధించకూడదు.
ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ వంటి అదనపు పనులకు తగిన ఆర్థిక సహకారం అందించాలి.
డిస్ట్రిబ్యూటర్ల అనుమతి లేకుండా రీఫిల్ ఆర్డర్లలో మార్పులు చేయవద్దు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతున్నట్లు అధికారిక ప్రకటన లేదు. ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా (FLDI), ఆల్ ఇండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AILDF) ప్రతిపాదిత ఆందోళనకు దూరంగా ఉంటూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. వినియోగదారులకు గ్యాస్ డెలివరీలకు అంతరాయం కలగకుండా చూడాలని కూడా స్పష్టం చేశాయి.


