LPG Gas Booking : దీపావళి వేళ సిలిండర్ బుకింగ్ చేస్తున్నారా? గ్యాస్ సరఫరాకు బ్రేక్ పడుతుందా? కేంద్రం ఏం చెప్పిందంటే!

Must read

  • పండుగ వేళ గ్యాస్ బుక్ చేస్తున్నారా?
  • దీపావళి ముందు గ్యాస్ సిలిండర్ టెన్షన్..
  • గ్యాస్ ఏజెన్సీల సమ్మెతో సిలిండర్ కొరత వస్తుందా?

LPG Gas Booking Alert : పండుగ వచ్చిందంటే ఇంట్లో సందడే సందడి.. పిండి వంటలు, పూజా కార్యక్రమాలు, కుటుంబ సభ్యుల రాకపోకలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. ఇలాంటి సమయంలో వంట గ్యాస్ సిలిండర్ సమయానికి అందకపోతే మాత్రం గృహిణులకు ఇబ్బందులు తప్పవు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎల్పీజీ గ్యాస్ సరఫరా, డెలివరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

గ్యాస్ డెలివరీపై కేంద్రం ఫోకస్ :
దీపావళి నేపథ్యంలో సిలిండర్ల బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు పిలుపునిచ్చారు.. తమ సమస్యలు పరిష్కరించాలని, డెలివరీ కమిషన్లు, ఈకేవైసీ ఛార్జీల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, డిస్ట్రిబ్యూటర్లు సమ్మెకు దిగితే సిలిండర్ల సరఫరా, డెలివరీలో ఆలస్యం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : Cyclone Arnab Alert : బంగాళాఖాతంలో అర్నబ్ బీభత్సం.. ఏపీకి భారీ తుపాను ముప్పు.. 140 కి.మీ వేగంతో గాలులు..

ముఖ్యంగా పండుగ సమయంలో గ్యాస్ కోసం ఎదురుచూసే కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సరఫరాను కొనసాగించాలని సంబంధిత వర్గాలకు సూచించింది.

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా (FLDI) ఈ ఆందోళనలకు తమ మద్దతు లేదని తెలిపింది. సమస్యలను నిరసనలతో కాకుండా ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. చర్చలు సానుకూలంగా సాగి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

వినియోగదారులు ఏం చేయాలి?
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు నగరాన్ని బట్టి మారుతున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.942గా, చెన్నైలో రూ.957గా, ముంబైలో రూ.941గా ఉంది. అయితే, సమ్మె వల్ల తప్పనిసరిగా గ్యాస్ కొరత ఏర్పడుతుందని కాదు..

వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేసుకోవడం, అధికారిక గ్యాస్ ఏజెన్సీల సమాచారం తెలుసుకోవడం బెటర్.. పండుగ వేళ వంటింట్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!