ఏపీలో తీవ్రమైన ‘అర్నబ్’ తుఫాన్.. NH-16 హైవే బంద్.. అధికారుల కీలక ఉత్తర్వులు

Must read

Cyclone Arnab: అర్నబ్ తుపాన్ తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉండటంతో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత జాతీయ రహదారి-16 పై అన్ని రకాల వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. తుని నుంచి అనకాపల్లి మీదుగా వెళ్లే వాహనాలతో పాటు విశాఖపట్నం, సబ్బవరం నుంచి తుని వైపు వెళ్లే రవాణాను రాత్రి వేళ సంపూర్ణంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ రహదారి పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs), హైవే పెట్రోలింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ప్రజలకు ఎస్పీ తుహిన్ సిన్హా అత్యవసర పిలుపు:

తుపాను(Cyclone Arnab) తీరం దాటే సమయంలో ప్రతికూల వాతావరణం నెలకొనే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వాహనదారులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, పోలీసు యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని కోరారు. రహదారులపై ఎదురయ్యే ముప్పును నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా నిలిపివేతను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆపదలో ఉంటే 112 లేదా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయండి.. 24/7 అందుబాటులో హెల్ప్‌లైన్:

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి అత్యవసర సహాయం కావలసినా తక్షణమే పోలీసులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు డయల్ 112 లేదా 100 నంబర్లతో పాటు అనకాపల్లి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 94409 04229 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!