Team India : శనివారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు ఇది 200వ విజయం కావడం విశేషం. ఈనేపథ్యంలో టీ20 క్రికెట్లో 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది. కాగా.. భారత్‌కు ఇది 300వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.
టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు భారత్ 300 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 200 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 83 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఏడు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. మిగిలిన 10 టీ20 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
PAK vs ENG : ఆదివారం అద్భుతం చేసిన పాక్.. ఇంగ్లాండ్ పై సంచలన విజయం.. నభూతో నభవిష్యత్..!
𝐀 𝐡𝐢𝐬𝐭𝐨𝐫𝐢𝐜 𝐦𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞, 𝐚 𝐠𝐨𝐥𝐝𝐞𝐧 𝐥𝐞𝐠𝐚𝐜𝐲
India are the first team with 200 T20I victories
https://t.co/LqlsQWK6Ea
— ICC (@ICC) October 25, 2026
ఇక భారత జట్టు తరువాతి స్థానంలో పాకిస్థాన్ ఉంది. పాక్ 304 టీ20 మ్యాచ్‌లు ఆడగా 174 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్, దక్షిణాప్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. అయితే.. ఈ జట్లు అన్ని కూడా భారత్, పాకిస్థాన్ కంటే తక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడాయి.
టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్లు ఇవే..
* భారత్ – 300 మ్యాచ్‌ల్లో 200 విజయాలు
* పాకిస్థాన్ – 304 మ్యాచ్‌ల్లో 176 విజయాలు
* న్యూజిలాండ్ – 269 మ్యాచ్‌ల్లో 135 విజయాలు
* దక్షిణాఫ్రికా – 235 మ్యాచ్‌ల్లో 129 విజయాలు
* ఇంగ్లాండ్ – 233 మ్యాచ్‌ల్లో 128 విజయాలు



https://t.co/LqlsQWK6Ea
