Dhoom 4 : ధూమ్ 4లో టాలీవుడ్ సూపర్ స్టార్..!

Must read

Dhoom 4 : బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన యాక్షన్ ఫ్రాంచైజీలలో ధూమ్ సిరీస్ ఒకటి. ఈ సిరీస్‌లోని అన్ని సినిమాల్లోనూ విలన్లు, దొంగతనాలు, బైకులు కథను రక్తి కట్టించాయి. అలాంటి భారీ క్రేజ్ సంపాదించుకున్న యాక్షన్ ఫ్రాంచైజీ ధూమ్ నాలుగో భాగంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ధూమ్-4లో సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో యాక్ట్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

స్టైలిష్ లుక్, స్వాగ్, యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే మహేష్ బాబు ఈ ఫ్రాంచైజీలో భాగమైతే సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయమనే చర్చ జరుగుతోంది. మహేష్ బాబు ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

అయితే ధూమ్-4 టీమ్ మహేష్ బాబును సంప్రదించిందా.? ఒకవేళ సంప్రదించి ఉంటే ఆయన ఓకే చెప్పారా.? లేక ధూమ్ సిరీస్‌కు ఉన్న ఆదరణను బట్టి ఎవరైనా రూమర్ క్రియేట్ చేశారా అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతానికి ఇదంతా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మాత్రమే. ధూమ్‌-4లో మహేష్‌ బాబు నటిస్తారో లేదో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజుల వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!