Xiaomi 4K TV : 43 అంగుళాల రూ.49,999 టీవీ ఇప్పుడు రూ.28,999కే.. అమెజాన్‌లో సగం ధరకే 4K స్మార్ట్ టీవీ

Must read

  • అమెజాన్ సేల్‌లో షావోమీ 43 ఇంచుల 4K టీవీపై భారీ ఆఫర్..
  • పెద్ద స్క్రీన్.. 4K క్వాలిటీ.. తక్కువ ధర షావోమీ టీవీపై బంపర్ డీల్
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్ సేల్‌ ఆఫర్లు

Amazon Great Indian Festival Reloaded : కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? భారీ స్క్రీన్‌తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందించే స్మార్ట్ టీవీని కొనేందుకు ఇదే బెటర్ టైమ్.. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్ సేల్‌లో షావోమీ టీవీపై అద్భుతమైన డీల్ అందిస్తోంది.

ముఖ్యంగా 43 ఇంచుల 4K స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే.. ఆకర్షణీయమైన ధరతో పాటు ప్రీమియం ఫీచర్లతో ఈ టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.. ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

షావోమీ టీవీ ఇప్పుడు రూ.28,999కే :
షావోమీ 108 సెం.మీ (43 ఇంచుల) ఎఫ్ఎక్స్ 4K క్యూడీ-మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.49,999గా ఉంది. అయితే, సేల్‌లో ఈ టీవీని రూ.28,999కు కొనుగోలు చేయొచ్చు. అంటే నేరుగా రూ.21వేల వరకు ధర తగ్గింది.

Read Also : RBI Repo Rate : లోన్ ఈఎంఐ కట్టేవారికి బిగ్ షాక్? మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు.. ఈసారి ఎంతంటే?

అదనంగా, అర్హత కలిగిన అమెజాన్ పే లేటర్ ఈఎంఐ లావాదేవీపై రూ.2,750 వరకు అదనపు బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఆఫర్ నిబంధనలు, క్యాష్‌బ్యాక్ అర్హతలను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేయండి.

పిక్చర్ క్వాలిటీ, సౌండ్‌లోనూ స్పెషాలిటీ :
ఈ షావోమీ స్మార్ట్ టీవీలో 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ (3840 × 2160 పిక్సెల్స్) అందించారు. 60Hz రిఫ్రెష్ రేట్‌తో సినిమాలు, టీవీ షోలు, ఇతర వీడియోలను క్లియర్ గా చూడొచ్చు. క్యూడీ-మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీతో పాటు HDR10+, HLG సపోర్ట్ కూడా ఉంది. ఏఐ ఆప్టిమైజేషన్ ఇంజిన్ ఫొటోల క్వాలిటీని అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

సౌండ్ విషయానికి వస్తే..
ఇందులో 20W స్పీకర్లు, డాల్ బై ఆడియో, డీటీఎస్-ఎక్స్ ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్‌నెట్ సదుపాయాలు కల్పించారు. అలాగే, 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ కూడా ఉన్నాయి.

కొనేముందు ఇలా చేయండి :
తక్కువ ధరలో 4K స్మార్ట్ టీవీని కొనాలని అనుకుంటే ఇదే బిగ్ డీల్.. అయితే, ధరలు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ మారే అవకాశం ఉంది. అమెజాన్‌లో లేటెస్ట్ వివరాలను చెక్ చేసిన తర్వాతే ఆర్డర్ చేయడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!