KCR Politics : తెలంగాణ పాలిటిక్స్‌తో కేసీఆర్ రీఎంట్రీపై చర్చ జరుగుతుంటే.. కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. సార్ వస్తారు.. రాష్ట్ర రాజకీయాలే కాదు.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నారనే టాక్ మొదలైంది. కేసీఆర్ మళ్లీ సీఎం అవడం ఖాయమని పదేపదే చెబుతున్న కేటీఆర్.. కాంగ్రెస్ చేతుల్లో మోస పోయిన అన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ మూడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
సేమ్‌టైమ్ నేషనల్ పాలిటిక్స్‌లో బీజేపీకి, కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయం కాలేకపోతుందని కేటీఆర్ విమర్శించడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రీఎంట్రీ.. బీఆర్ఎస్లో జోష్ నింపడంతో పాటు.. జాతీయ రాజకీయాల్లో కీరోల్ ప్లే చేసే దిశగా ఉంటుందని చెప్పకనే చెప్పారన్న చర్చ రాజకీయవర్గాల్లో స్టార్ట్ అయింది.
కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే చర్చకు పెట్టారు కేసీఆర్. టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. అదే సమయంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే, ప్రాంతీయ పార్టీల సమీకరణాలు బలపడకపోగా.. ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి కూడా.. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌కు బ్రేకులు వేసినట్లు అయింది. లేటెస్ట్గా కేటీఆర్ వ్యాఖ్యలతో గులాబీ బాస్ నేషనల్ పాలిటిక్స్‌పై చర్చ మొదలైంది.
గతంలో ఆగిపోయిన జాతీయ రాజకీయ ప్రయాణాన్ని.. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ రీచార్జ్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ వైఫల్యంతో.. బీజేపీ బలహీనపడుతుందన్న అంశాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు కేటీఆర్. దేశంలో బీజేపీ గతంలో ఉన్నంత బలంగా లేదంటున్న కేటీఆర్.. కాంగ్రెస్ కూడా ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతోందని అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఎదగడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యువతలోఉన్న అసంతృప్తికి తోడు.. బీజేపీపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. నేషనల్ పాలిటిక్స్‌లో ఉన్న వ్యాక్యూమ్‌ను కేసీఆర్ తనకు ఎలా అనుకూలంగా మల్చుకుంటారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే, తెలంగాణలో పార్టీ బలోపేతంతో పాటు.. దేశ రాజకీయాల్లో అనుకూలమైన పరిస్థితుల కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నరన్న చర్చ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని పార్టీ నేతల్లో నమ్మకాన్ని పెంచడం.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రపై చర్చ పెట్టడం బీఆర్ఎస్ ఎజెండాగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకతను బీఆర్ఎస్కు అనుకూలంగా మలచుకోవడం ఒక ఎత్తయితే.. నేషనల్ పాలిటిక్స్‌లో కాంగ్రెస్, బీజేపీకి ఆల్టర్నేట్గా ఎస్టాబ్లిష్ అవడం మరో స్కెచ్‌గా చెబుతున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపై తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్‌తో సంబంధాలు.. బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య నాయకత్వ పోటీ.. రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు.. ఇవన్నీ కేసీఆర్ ముందున్న సవాళ్లు. మరి గతానికి మించి తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తూ.. జాతీయ స్థాయిలో సంప్రదింపులకు తెరతీస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. దేశం ఎదర్కొంటున్న సమస్యలపై మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తోంది గులాబీ పార్టీ సోషల్ మీడియా.
వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నా.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వాటర్ వార్‌కు చెక్ పెట్టలేకపోయాయంటూ కేసీఆర్ మాట్లాడిన స్పీచ్‌ను హైలెట్ చేస్తున్నారు. జెన్‌జీ ఉద్యమానికి లింకు పెడతూ.. ఇండియా రియాక్స్ట్ అంటూ గతంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. యూత్, స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్‌కు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ గతంలో కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల ప్రస్తావన వేళ కేసీఆర్ ముందే చెప్పాలరంటూ చర్చకు పెడుతున్నారు గులాబీ కార్యకర్తలు. ఏదైనా కేటీఆర్ కామెంట్స్‌తో గులాబీ బాస్ నేషనల్ పాలిటిక్స్ అంటూ మళ్లీ చర్చ జరగడం మాత్రం పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది.


