Ram Charan : RC17లో దురంధర్ బ్యూటీ కాదా? బాలీవుడ్ ని ఒక్క సినిమాతోనే షేక్ చేసిన హీరోయిన్ ని ఫైనల్ చేసారా?

Must read

Ram Charan : పెద్ది విజయం తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సినిమా నుంచి ఎలాంటి చడీ చప్పుడు లేదు. దసరాకి ఓపెనింగ్ అన్నారు అది కూడా లేదు. సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ నుంచి లీకులు కూడా లేవు. దీంతో RC17 అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అయితే ఇన్ని రోజులు ఈ సినిమాలో దురంధర్ బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సారా అర్జున్ కాదు అని మరో కొత్త హీరోయిన్ పేరు వినిపిస్తుంది. RC17 లో రామ్ చరణ్ సరసన నటించేది బాలీవుడ్ భామ అనీత్ పడ్డా అని తెలుస్తుంది. అనీత్ పడ్డా బాలీవుడ్ లో సైయారా అనే సినిమాలో హీరోయిన్ గా నటించి లవ్ స్టోరీతో పెద్ద హిట్ కొట్టి సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది.

Also Read : Subodh Bhave : ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించింది ఎవరో తెలుసా? ఏకంగా 5 సార్లు బెస్ట్ యాక్టర్..

అనీత్ పడ్డా బాలీవుడ్ లో సలాం వెంకీ అనే సినిమాలో కీలక పాత్రతో ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్ సిరీస్ లలో నటించింది. సైయారా సినిమాలో హీరోయిన్ గా ఒక్కసారిగా వైరల్ అయింది. ఆ సినిమా ఏకంగా 500 కోట్లు కొట్టడంతో అనీత్ పడ్డా బాలీవుడ్ లో స్టార్ అయిపోయింది. ఇప్పుడు అనీత్ పడ్డాని సుకుమార్ టాలీవుడ్ కి తీసుకొస్తున్నాడట.

నిన్న ఆల్రెడీ అనీత్ పడ్డా హైదరాబాద్ కి వచ్చిందని, 26వ తేదీన RC17 పూజ కార్యక్రమం జరుగుతుందని, ఈ రెండు రోజులు అనీత్ పడ్డాకు ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేస్తారని టాలీవుడ్ టాక్. RC17 లో మొదట చాలా పేర్లు వినిపించినా చివరకు సారా అర్జున్ ఫైనల్ అన్నారు. ఇప్పుడు అనీత్ పడ్డానే ఫైనల్ అంటున్నారు. మరి చరణ్ సరసన నటించే లక్ ఏ బ్యూటీకి ఉందో అధికారికంగా తెలియాలంటే ఈ సినిమా ఓపెనింగ్ వరకైనా వేచి చూడాల్సిందే.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!