Dasara Holidays 2026 : ఎల్‌నినో ప్రభావం.. విద్యార్థులకు దసరా సెలవులు పెంపు..

Must read

Dasara Holidays 2026 : దసరా సెలవులు ముగిశాయి. విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. సుమారు పదమూడు రోజులపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులు మళ్లీ బడుల బాటపట్టారు. అయితే, బాసర రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్ మాత్రం దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెలవులను పొడిగించింది.

Also Read : Mumbai Indians : ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. జయవర్ధనే స్థానంలో కొత్త హెడ్‌కోచ్‌గా విధ్వంసకర ఆల్‌రౌండర్‌

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, క్యాంపస్ సమీపంలోని చెరువు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో క్యాంపస్‌లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దసరా సెలవుల అనంతరం శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. తీవ్ర నీటి కొరత కారణంగా సెలవులను పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నీటి కొరత తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 9వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వీరికి రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. అయితే, ప్రస్తుతం క్యాంపస్ కు కేవలం 15 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రోజుకు సుమారు 10లక్షల లీటర్ల నీటి కొరత ఏర్పడుతోంది.

విద్యార్థులు క్యాంపస్ కు తిరిగి వస్తే తాగునీరు, స్నానాలు, వంటశాలలు, పారిశుద్ధ్య అవసరాలకు నీటిని సమకూర్చడం కష్టం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో క్యాంపస్‌కు రోజుకు అవసరమయ్యే 25లక్షల లీటర్లకుపైగా నీటిని నిరంతరంగా సరఫరా చేయగలిగిన తరువాతే తరగతులను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!